Varudu Kaavalenu : వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

October 29, 2021 1:03 PM

Varudu Kaavalenu : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఎన్నో ప్రమోషన్ కార్యక్రమాలను, సంగీత్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ సినిమా ప్రమోషన్ ను పెద్దఎత్తున నిర్వహించారు.

Varudu Kaavalenu twitter review how is the movie

అదే విధంగా పలువురు దర్శకులు, హీరోలు ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పలువురు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే పలువురు స్పందిస్తూ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంది సెకండాఫ్ కాస్త స్లోగా ఉంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఎంతో అద్భుతంగా ఉందని, ఎమోషనల్ గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని తెలియజేస్తున్నారు. మొత్తానికి మొదటి షో పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మిశ్రమ ఫలితాలను పొందుతోంది. ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్న ఈ సినిమా మరిన్ని షోలకు ఎలాంటి రివ్యూలను సాధిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now