Ranbir Kapoor Alia Bhatt : బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ – అలియా జంట ఒకటి. వీరు గత కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ క్రమంలో వీరి పెళ్లి అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని ఐకానిక్ ప్యాలెస్ హోటల్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెడ్డింగ్ కంటే ముందు అలియా, రణ్‌బీర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అలియా భట్.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకు కూడా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో అలియా సీత పాత్రలో కనిపించనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…