Ranbir Kapoor Alia Bhatt : క్రేజీ క‌పుల్ ఒక్క‌టి కాబోతున్నారు.. పెళ్లి ఎప్పుడో తెలుసా ?

October 27, 2021 8:46 PM

Ranbir Kapoor Alia Bhatt : బాలీవుడ్ క్రేజీ క‌పుల్స్‌లో ర‌ణ్‌బీర్ – అలియా జంట ఒక‌టి. వీరు గ‌త కొద్ది రోజులుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. క‌లిసి ఒకే ఇంట్లో ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ క్రమంలో వీరి పెళ్లి అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

Ranbir Kapoor Alia Bhatt may tie knot very soon

డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజ‌స్థాన్‌లోని ఐకానిక్ ప్యాలెస్ హోట‌ల్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు కుటుంబ‌ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వెడ్డింగ్ కంటే ముందు అలియా, ర‌ణ్‌బీర్ బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని పూర్తి చేయ‌నున్నారు. ఇత‌ర ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల‌ని అనుకుంటున్నారు.

గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అలియా భ‌ట్.. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కు కూడా ప‌రిచ‌యం అవుతోంది. ఈ సినిమాలో అలియా సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now