Ram Charan Tej : వామ్మో.. చరణ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. వరుసగా ఆ డైరెక్టర్లకి గ్రీన్ సిగ్నల్..!

October 27, 2021 8:11 PM

Ram Charan Tej : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు విడుదల కాకుండానే రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో, కియారా అద్వానీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూణేలో జరుగుతున్నాయి.

Ram Charan Tej on full speed with movies

ఇదిలా ఉండగా శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఉండబోతుందని దసరా కానుకగా ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించారు. అయితే ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. చరణ్ మాత్రం తాజాగా మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్ విన్న రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్క్రిప్ట్ తయారు చేయమని చెప్పినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ స్పీడ్ మీద రామ్‌ చరణ్‌ ఉన్నారని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment