Rakul Preet Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి రకుల్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ అంటూ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయం గురించి సోషల్ మీడియాలో తెలియజేయడంతో అందరూ అసలు ఈ జాకీ భగ్నానిని ఎవరు ? తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? రకుల్ అతనిని ప్రేమించడానికి కారణం ఏమిటి ? అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ జాకీ ఎవరు అనే విషయానికి వస్తే.. అతను బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
జాకీ కోల్‌కతాలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇతనికి దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇలా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతనికి గతంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని కొన్ని కారణాల వల్ల ఆమెతో బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. అసలు ఇతను ఎవరితోనూ ఎక్కువ కాలం పాటు రిలేషన్ లో ఉండరని టాక్. మరి రకుల్ విషయంలో ఇతని ప్రయాణం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…