Maa : మా ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు, ఇతర పరిణామాలపై ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది రాజీనామా చేస్తారని చెప్పారు. మంచు విష్ణు తనకు కావల్సిన వాళ్లను పెట్టుకుని మా ను అభివృద్ధి చేయవచ్చని.. తాము బయటి నుంచి సపోర్ట్ ఇస్తామని అన్నారు.
అయితే విలేకరుల సమావేశం సందర్బంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అర గంట పాటు తనను బండ బూతులు తిట్టారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబంలో తాను ఎన్నో ఏళ్ల నుంచి ఒక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. మంచు లక్ష్మీ, మంచు విష్ణులను తన చేతుల్తో ఎత్తుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇకపై తాను మా లో కొనసాగలేనని, మంచు విష్ణు అభివృద్ది చేస్తాడన్న నమ్మకం ఉందని.. కనుక బయటకు వచ్చేస్తున్నానని బెనర్జీ తెలిపారు. తన కుటుంబంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…