Rakul Preet Singh : రకుల్ బాయ్‌ ఫ్రెండ్‌ జాకీ భగ్నాని అలాంటి వాడా ? రకుల్‌తో రిలేషన్‌ ఏమవుతుంది ?

October 12, 2021 6:19 PM

Rakul Preet Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి రకుల్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ అంటూ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్లు తెలియజేశారు.

Rakul Preet Singh boy friend jackky bhagnani real truth

ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయం గురించి సోషల్ మీడియాలో తెలియజేయడంతో అందరూ అసలు ఈ జాకీ భగ్నానిని ఎవరు ? తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? రకుల్ అతనిని ప్రేమించడానికి కారణం ఏమిటి ? అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ జాకీ ఎవరు అనే విషయానికి వస్తే.. అతను బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జాకీ కోల్‌కతాలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇతనికి దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇలా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతనికి గతంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని కొన్ని కారణాల వల్ల ఆమెతో బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. అసలు ఇతను ఎవరితోనూ ఎక్కువ కాలం పాటు రిలేషన్ లో ఉండరని టాక్. మరి రకుల్ విషయంలో ఇతని ప్రయాణం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now