Radhe Shyam : రాధే శ్యామ్ స్టోరీ బయటపెట్టిన లిరిక్ రైటర్..!

November 21, 2021 12:20 PM

Radhe Shyam : ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి లిరిక్ రైటర్ కృష్ణ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన.. ఈ రాతలే అనే పాటలో సినిమా మొత్తాన్ని తెలియజేశారని అందరూ భావించారు.

Radhe Shyam story revealed by lyric writer

ఈ సినిమాలో ఈ పాటలో కేవలం కొంత మాత్రమే చెప్పామని అసలు సిసలైన కథ ఇంకా ఉందని వెల్లడించారు. ఈ పాట విడుదలతోనే ఎంతో మంచి రెస్పాన్స్ దక్కించుకుందని కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల వారికి కూడా ఎంతగానో నచ్చిందని వెల్లడించాడు. ఈ సినిమా ఒక పునర్జన్మ కథ అని, ఇది ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనీ సైన్స్ ఫిక్షన్ కథ అనీ ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు, అయితే 1970లో యూరప్‌లో జరిగే ప్రేమ కథ అని స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రేమించుకున్న వారు ప్రేమలో విఫలం కావడం సర్వ సాధారణం. మరి ఈ కథలో రాధాకృష్ణులు కలిశారా ? వారి ప్రేమకు ముగింపు పలికారా ? అన్నదే.. ఈ సినిమా అని.. ఈ సందర్భంగా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ తెలిపారు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం కోసం ఐదు పాటలు రాశానని ఈ సందర్భంగా కృష్ణకాంత్ ఈ సినిమా గురించి వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment