Radhe Shyam : రాధేశ్యామ్ క్లైమాక్స్.. ఇలా రివీల్ చేశారేంటి..!

November 7, 2021 6:19 PM

Radhe Shyam : బాహుబ‌లి త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన సాహో చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చ‌డంతో ప్రభాస్‌ త‌దుప‌రి చిత్రం రాధే శ్యామ్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతోంది. ప్ర‌భాస్ పుట్టిన‌ రోజైన అక్టోబ‌ర్ 23వ తేదీన ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.

Radhe Shyam climax important things revealed

చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, ఈ సినిమాకి ఛాయాగ్రహకుడిగా వ్యవహరించిన మనోజ్ పరమహంస తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లైమాక్స్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. క్లైమాక్స్ లో 15 నిమిషాల పాటు మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఉంటుందని పరమహంస చెప్పారు. క్లైమాక్స్‌ను దాదాపు రూ.50-80 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన రీతిలో చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.

క్లైమాక్స్ కోసం ఒక సంవత్సరానికి పైగా పనిచేశానని, ఇది 1970ల నాటి ఇటాలియన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింద‌ని పేర్కొన్నారు. ప‌ర‌మ‌హంస వ్యాఖ్య‌ల త‌ర్వాత రాధేశ్యామ్ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment