Pushpa Movie : పుష్ఫ తమిళ సినిమా రైట్స్‌ వాళ్లకే.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

November 18, 2021 11:06 PM

Pushpa Movie : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో సందడి చేయనున్నాడు. అందరు నటులూ డీ గ్లామర్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

Pushpa Movie tamil rights sold to lyca productions

ఇక ఇందులో ఐటం సాంగులో హీరోయిన్ సమంత నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన హక్కులను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ సంస్థ తమిళ థియేట్రికల్ హక్కులను రూ.7 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా తమిళ థియేట్రికల్ హక్కులను కూడా లైకా సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment