Puneeth Rajkumar : చిరంజీవితో న‌టించాల‌ని క‌ల‌లుగ‌న్న పునీత్‌.. కోరిక తీర‌కుండానే క‌న్నుమూశారు..!

October 31, 2021 8:10 AM

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. అభిమానులు కూడా ఆయ‌న మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలుగు సినీ ప్ర‌ముఖులు కూడా పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, ఎన్టీఆర్‌తోపాటు ప‌లువురు తెలుగు సినీ ప్ర‌ముఖులు బెంగ‌ళూరు వెళ్లి పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.

Puneeth Rajkumar last wish is to act with chiranjeevi

పునీత్ మ‌ర‌ణంపై స్పందించిన భోళా శంక‌ర్ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌.. చాలా ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ‘పునీత్ నాకు లైఫ్‌ ఇచ్చిన హీరో. ఆయ‌న హీరోగా న‌టించిన‌ ‘వీర క‌న్న‌డిగ’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాను. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న‌తో మ‌రో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. న‌న్ను ఇంటి స‌భ్యుడిలా చూసుకునేవారు.

చిరంజీవితో భోళా శంక‌ర్ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌డు ఆయ‌న నాకు ఫోన్ చేసిశుభాకాంక్ష‌లు తెలియ‌జేసి సినిమాలో చిరంజీవి ప‌క్క‌న న‌టించే ఛాన్స్ ఇవ్వ‌మని కోరారు. అది కుద‌ర‌క‌పోతే క‌నీసం ఏదైనా ఒక‌ పాట‌లో మెగాస్టార్‌తో క‌లిసి చిన్న స్టెప్పు వేస్తాన‌ని అడిగారు. చిరంజీవితో న‌టించాల‌న్న‌ది త‌న కోరిక అని కూడా చెప్పారు. ఆయ‌న ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం చాలా బాధ‌ను క‌లిగిస్తుంద‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు మెహ‌ర్ ర‌మేష్‌. కాగా, గుండె పోటుతో మ‌ర‌ణించిన క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లను ఆదివారం నిర్వహించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment