బుధవారం, జూన్ 17, 2026
వినోదం

అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ‘రోలెక్స్’ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రియాంకా చోప్రా!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విలువైన సెలబ్రిటీ ఎండార్సర్లలో ఒకరిగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్రాండ్‌ను తన ఖాతాలో చేర్చుకుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ ప్రముఖుల్లో ఒకరైన ఆమె, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ తయారీ సంస్థ రోలెక్స్ కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ‘రోలెక్స్’ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రియాంకా చోప్రా!
అంతర్జాతీయ బ్రాండ్ రోలెక్స్ ప్రతినిధిగా మెరిసిపోతున్న ప్రియాంకా చోప్రా. Photo Credit: Priyanka Chopra/Instagram.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విలువైన సెలబ్రిటీ ఎండార్సర్లలో ఒకరిగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్రాండ్‌ను తన ఖాతాలో చేర్చుకుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ ప్రముఖుల్లో ఒకరైన ఆమె, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ తయారీ సంస్థ రోలెక్స్ కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. రోలెక్స్ అధికారికంగా ప్రియాంకా చోప్రాను రోలెక్స్ టెస్టిమోనీగా ప్రకటించింది. రోలెక్స్ తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లను ఈ పేరుతో పిలుస్తుంది. ఈ నియామకం ద్వారా అంతర్జాతీయ వేదికపై ప్రియాంకా ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ Bvlgari, లగ్జరీ ఆటోమొబైల్ సంస్థ బెంట్లీ మోటార్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రోలెక్స్ కూడా ఆమెతో చేతులు కలపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ముఖాల్లో ఆమె స్థానం మరింత బలపడింది.

భారీ పారితోషికం..?

ఇక సినిమాల పరంగా కూడా ప్రియాంకా చోప్రా వార్తల్లో నిలుస్తున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో మ‌హేష్ బాబు సరసన నటించేందుకు ఆమె ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెకు సుమారు రూ.25 కోట్ల పారితోషికంతోపాటు అదనపు ప్రయోజనాలు కూడా అందుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణిగా ఆమె నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.

అగ్ర‌శ్రేణి బ్రాండ్ల ఆస‌క్తి..

అంతర్జాతీయ స్థాయిలో బలమైన గుర్తింపు, విస్తృతమైన అభిమాన వర్గం, గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న ప్రభావం కారణంగా ప్రియాంకా చోప్రా భారీ పారితోషికాలను అందుకుంటూనే అగ్రశ్రేణి బ్రాండ్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా రోలెక్స్ కూడా ఆమె ఎండార్స్‌మెంట్ జాబితాలో చేరడంతో ఆమె బ్రాండ్ విలువ మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి