గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Pregnant : గర్భిణీలు వీటిని పాటిస్తే.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు..!

Pregnant : గర్భిణీల‌కి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి. వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కగా హాయిగా జీవించొచ్చు. స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. స్మోకింగ్…

Pregnant : గర్భిణీలు వీటిని పాటిస్తే.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు..!

Pregnant : గర్భిణీల‌కి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి. వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కగా హాయిగా జీవించొచ్చు. స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది. గ‌ర్భంతో ఉంటే సిగరెట్, బీడీ మొదలైన వాటిని కాల్చకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వీటివలన ఆరోగ్యం బాగా పాడవుతుందని గమనించండి. అదే విధంగా కాఫీ, తంబాకు, పొగాకు, ఆవకాయ, పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, పచ్చి బొప్పాయి వంటివి తీసుకోకూడదు.

రోజూ అరగంటసేపు ఎండలో తిరిగితే మంచిది. రోజూ ఆకుకూరల్ని, కూరగాయల్ని, ఉడికిన పప్పు గింజల్ని తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, బెల్లం కూడా తింటూ ఉండండి. వేరుశనగ కూడా ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా గర్భిణీలు గుడ్లు తింటే మంచిది. ప్రోటీన్ బాగా అందుతుంది. కానీ చాలా మంది బిడ్డకు వెంట్రుకలు ఉండవని అంటూ ఉంటారు. అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే.

Pregnant women must follow these health tips
Pregnant

కాళ్ల వాపులతో బాధపడే వాళ్ళు రోజూ రెండు గుడ్లు తింటే మంచిది. లేదంటే గుప్పెడు వేరుశెనగ గింజలను తీసుకుంటే మంచిది. పగలు రెండు గంటలసేపు, రాత్రి పూట ఎనిమిది గంటలసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది. గర్భిణీలు ఏడవ నెలలో ఎడమవైపుకి తిరిగి పడుకుంటే కడుపులో ఉండే పిండం బాగా ఎదుగుతుంది. అదేవిధంగా కడుపుతో ఉన్నవాళ్లు వైద్యుల్ని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. స్కానింగ్ లని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. గర్భిణీలు వికారాన్ని తెప్పించే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

గర్భిణీలు ఎర్రని మాంసం, సీ ఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, ఐరన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. గర్భిణీలకు విశ్రాంతి చాలా ముఖ్యం. రోజూ 10 గంటలసేపు గర్భిణీలు నిద్రపోతే మంచిది. ప్రతి రోజు కూడా గర్భిణీలు మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే మొలల‌ సమస్య వస్తుంది. గర్భిణీలు ఉదయం, రాత్రి నిద్ర పోయేటప్పుడు క‌చ్చితంగా దంతాల‌ను తోముకోవాలి. ఇలా గర్భిణీలు ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి