గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pranitha : తన కుమార్తె ఫొటోలను షేర్‌ చేసిన ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..?

Pranitha : నటి ప్రణీత ఇటీవలే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్‌ 9వ తేదీన ప్రణీత తన పాపకు జన్మనిచ్చింది. ఆమెకు అర్నా అనే పేరు కూడా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రణీత…

Pranitha : తన కుమార్తె ఫొటోలను షేర్‌ చేసిన ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..?

Pranitha : నటి ప్రణీత ఇటీవలే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్‌ 9వ తేదీన ప్రణీత తన పాపకు జన్మనిచ్చింది. ఆమెకు అర్నా అనే పేరు కూడా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రణీత తన కుమార్తెను ఫొటోల్లో చూపించలేదు. కానీ తాజాగా ఆమె తన కుమార్తె ఫొటోలను షేర్‌ చేసింది. అర్నాకు ఫొటోషూట్‌ నిర్వహించిన ప్రణీత ఆమె ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో తల్లీ బిడ్డ ఇద్దరూ ఎంతో క్యూట్‌గా ఉన్నారు.

కాగా ప్రణీత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈమె నటించిన పలు మూవీలు హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా తెలుగులో చేసిన అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. చివరిసారిగా ఈమె ఎన్‌టీఆర్‌ కథానాయకుడు సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటించింది.

Pranitha shared her baby girl photo viral
Pranitha

ఇక 2021లో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఈమె నితిన్‌ రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. కరోనా సమయంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చి గొప్ప మనసు చాటుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి