Radhe Shyam Teaser : సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ నామ‌స్మ‌ర‌ణ‌.. రాధేశ్యామ్ టీజ‌ర్ మోత మోగిస్తోంది..!

October 23, 2021 12:02 PM

Radhe Shyam Teaser : ప్ర‌భాస్ సినిమాల‌కు చెందిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న రాధేశ్యామ్ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే శ‌నివారం (అక్టోబ‌ర్ 23, 2021) ప్ర‌భాస్‌ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా రాధే శ్యామ్ కు చెందిన టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అద‌రిపోయే డైలాగ్స్ ఉండ‌డం విశేషం.

prabhas Radhe Shyam Teaser creating sensation in social media

అన్నీ నాకు తెలుసు అంటూనే.. నేను ఏమీ చెప్ప‌ను. కానీ నేను దేవున్నికాదు, అది మీ ఊహ‌కు కూడా అంద‌దు.. అంటూ ప్ర‌భాస్ ఈ టీజ‌ర్ లో డైలాగ్స్ చెప్పారు. ఇక ఇందులో పామిస్ట్ విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్ క‌నిపిస్తున్న‌ట్లు రివీల్ చేశారు. దీంతో ఈ మూవీపై అభిమానాల్లో ఇంకా అంచ‌నాలు పెరిగిపోయాయి.

రాధేశ్యామ్ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డె న‌టిస్తుండ‌గా.. ఈ మూవీకి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ జ‌న‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డం, మ‌ళ‌యాళం భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. కాగా తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు అభిమానుల నుంచి క్రేజీగా రెస్పాన్స్ వ‌స్తోంది. సోష‌ల్ మీడియా మొత్తం ప్ర‌భాస్‌, రాధేశ్యామ్ నామ‌స్మ‌ర‌ణ‌తో మోత మోగిపోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment