గురువారం, జూన్ 11, 2026
ఉద్యోగాలు

Postal Jobs : పోస్టాఫీస్‌ల‌లో 98వేల ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి చాలు.. జీతం ఎంతంటే..?

Postal Jobs : నిరుద్యోగ యువతకు మంచి సదవకాశం. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై  45% మార్కులు పొందితే చాలు.  పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా…

Postal Jobs : పోస్టాఫీస్‌ల‌లో 98వేల ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి చాలు.. జీతం ఎంతంటే..?

Postal Jobs : నిరుద్యోగ యువతకు మంచి సదవకాశం. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై  45% మార్కులు పొందితే చాలు.  పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టాఫీసుల్లో పోస్ట్ మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ మెన్ ఉద్యోగాలు 59,099, మెయిల్ గార్డ్ పోస్టులు 1445, ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిసెంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మొత్తం ఖాళీల్లో తెలంగాణ సర్కిల్ పరిధిలో 2513 పోస్టులున్నాయి. ఇందులో 1553 పోస్ట్ మ్యాన్ జాబ్స్, 82 మెయిల్ గార్డ్ పోస్టులు, 878 ఎంటీఎస్ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించుకోండి.

Postal Jobs post office recruitment 2022 latest jobs how to apply
Postal Jobs

పోస్టాఫీసుల్లో వివరాలు ప్రకారం పోస్ట్ మ్యాన్  59,099, మెయిన్ గార్డ్ 1445, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 37,539 పోస్టులకు భర్తీ చేయనుంది. 2022 నాటికి అవసరమైన వయో పరిమితి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి  గరిష్ట వయస్సు 32 సంవత్సరాలగా ఉండాలి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

పోస్టుని అనుసరించి రూ.₹20,700/- నుంచి రూ ₹69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులందరికి దరఖాస్తు రుసుము 100 రూపాయలు. ఎస్సీ మరియు ఎస్టీ, ex- సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు రుసుము చెల్లించేవారు డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.  పోస్ట్ మ్యాన్ పోస్టులకు ఇంటర్మీడియట్, మెయిల్ గార్డు, ఎంటీఎస్  పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి