Pooja Hegde : బిగుతైన జిమ్ డ్రెస్‌లో అల‌రిస్తున్న పూజా హెగ్డె.. ఫొటో వైర‌ల్‌..!

March 31, 2022 10:11 AM

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె గ‌తేడాది కాలంగా ఎంతో బిజీగా ఉంది. ఈమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అవుతున్నాయి. దీంతో ఈమె ఇండ‌స్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. మొద‌ట్లో ఈమె న‌టించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈమెకు అదృష్టం చాలా ఉన్న‌ట్లుంది.. గతేడాది కాలం నుంచి వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. ఇక ఫిట్‌నెస్ విష‌యంలోనూ పూజా హెగ్డె ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె త‌ర‌చూ జిమ్‌కు వెళ్తుంటుంది.

Pooja Hegde latest green colour gym dress photo viral
Pooja Hegde

ఇక తాజాగా పూజా హెగ్డె జిమ్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా.. తీసిన ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అందులో బిగుతైన దుస్తులు ధ‌రించిన పూజా మ‌తులు పోగొట్టేలా ఉంది. ఈ క్ర‌మంలోనే ఈమె ఫొటోను చూసి నెటిజ‌న్లు సైతం త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవ‌లే పూజా హెగ్డె ప‌లుమార్లు మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు అని వెళ్లి అక్క‌డ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను దిగి వాటిని షేర్ చేసింది. ఆ ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

పూజా హెగ్డె సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీ త్వ‌రలోనే విడుద‌ల కానుంది. ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న నటించింది. ఈ సినిమా ఏప్రిల్ చివ‌ర్లో విడుద‌ల‌వుతోంది. ఇక త్వ‌ర‌లోనే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ ఈమె న‌టించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now