Pooja Hegde : పవన్‌ కల్యాణ్‌ కోసం వేచి చూడలేకపోతున్న పూజా హెగ్డె..?

November 7, 2021 12:22 PM

Pooja Hegde : త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపుగా మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస సినిమాలు ప్ర‌క‌టించారు ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ‘భీమ్లా నాయక్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా కూడా చేస్తున్నారు.

Pooja Hegde is hardly waiting for pawan movie

ఇక పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌తో దేశ భక్తి నేపథ్యంలో ఓ సినిమా చేయనున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ విడుద‌ల చేస్తూ మూవీ టైటిల్ ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతోపాటు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేది ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నారు.

చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు హ‌రీష్ శంక‌ర్. అయితే ప‌వ‌న్ పొలిటిక‌ల్ కార్య‌క్ర‌మాల వ‌ల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతోంది. మ‌రోవైపు పూజా హెగ్డే క్ష‌ణం కూడా తీరిక‌లేని కాల్షీట్స్‌తో బిజీగా ఉంది. ప‌వ‌న్ సినిమా మొద‌లు పెట్టే స‌రికి పూజా త‌న కాల్షీట్స్ మేనేజ్ చేయ‌గ‌లుగుతుందా.. అనే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పవన్‌ తన రాజకీయ కార్యక్రమాల వల్ల బిజీగా ఉండడంతో మూవీ షూటింగ్‌  ఆలస్యం అవుతోంది. అయితే అప్పటికి పూజా హెగ్డె ఇచ్చిన కాల్‌ షీట్స్‌ సమయం అయిపోతుంది. దీంతో మళ్లీ కొత్తగా కాల్‌ షీట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆమెకు సమస్యగా మారనుంది. ఆమె ఫుల్‌ బిజీగా ఉండడంతో మళ్లీ కాల్‌ షీట్స్‌ను మార్చాల్సి వస్తుంది. మరి అందుకు ఆమె ఓకే చెబుతుందా.. పవన్‌ కోసం ఆగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment