Pooja Hegde : బాడీలో ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోనున్న పూజా హెగ్డే.. ఇంతకీ బుట్టబొమ్మకు ఏమైందంటే..?

September 26, 2022 9:33 AM

Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్‌ ఇండియా హీరోయిన్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి.

అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ తీసిన ప్రతి సినిమా మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదే క్రమంలో హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో నిర్మాతలకి లాభాలు పంట పండించింది. నిర్మాతల పాలిట పూజా హెగ్డే దేవతలా మారిపోయింది. అయితే ఇటీవల వచ్చిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి భారీ డిజాస్టర్ గా టాక్ తెచ్చుకోవడంతో.. సినీ ఇండస్ట్రీలో పూజ హెగ్డే గ్రాఫ్ డౌన్ అయింది. దీంతో పూజ హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలోనే పూజ మైనస్ విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.

Pooja Hegde getting trolls for back to back flop movies
Pooja Hegde

ప్రస్తుతం పూజా హెగ్డే ముక్కు గురించి కొందరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజ హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమె ముఖానికి అదే మైనస్ అని అంటున్నారు. దీంతో హర్ట్ అయిన పూజా హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయిందట. ఇదే విషయం ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు సర్జరీ చేయించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ బాడీలో చాలా పార్టులకు సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత బుట్ట బొమ్మ ముక్కు ఏ విధంగా తయారవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now