గురువారం, జూలై 2, 2026
వార్తలు

Paruchuri Venkateswara Rao : గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయిన ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర్ రావు.. అస‌లేమైంది..?

Paruchuri Venkateswara Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలకు రచయితలుగా పనిచేసి…

Paruchuri Venkateswara Rao :  గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయిన ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర్ రావు.. అస‌లేమైంది..?

Paruchuri Venkateswara Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలకు రచయితలుగా పనిచేసి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరూ 300 చిత్రాలకు పైగా రచయితలుగా పని చేయగా 200 చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. పరచూరి బ్రదర్స్ లో ఒకరైన‌ వెంకటేశ్వర రావు గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ.. సినిమాలకు రచన చేసేవారు.

Paruchuri Venkateswara Rao changed a lot photo viral
Paruchuri Venkateswara Rao

ఈ విధంగా పరుచూరి బ్రదర్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రచయిత‌లుగా పని చేయడమే కాకుండా పలు సినిమాల‌లో కీలక పాత్రలలో కూడా నటించారు. అలాగే దర్శకులుగా కూడా పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో పరుచూరి బ్రదర్స్ కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక అప్పుడప్పుడు పరుచూరి గోపాలకృష్ణ వీడియోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా వెంకటేశ్వరరావు మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

అయితే తాజాగా దర్శకుడు జయంత్ సి పరాంజీ.. పరుచూరి వెంకటేశ్వరావుని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల‌ను చూసిన నెటిజన్లు అయ్యో గురువు గారు ఏంటి ఇలా అయిపోయారు అంటూ ఆయన వృద్ధాప్య స్థితిని చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆయ‌న తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డం వ‌ల్లే ఇలా మారిపోయార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి