NTR : టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డ ఎన్టీఆర్‌కి యమదొంగ చిత్రం మంచి జోష్‌ని అందించింది. ఆ తర్వాత కొన్ని సక్సెస్‌లు, మళ్లీ ఫ్లాపులు. టెంపర్ తర్వాత ఇక ఎన్టీఆర్ వెనుదిరగి చూసుకోలేదు. వరుస హిట్స్‌తో స్టార్ హీరోగా మారాడు. ఆయనకు ఉన్న అభిమాన గణం ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు జూనియర్.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన డిప్రెషన్ గురించి బయటపెట్టాడు. 17 ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాను. రెండవ సినిమాకే స్టార్ స్టేటస్ చూశాను. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయాను.
గందరగోళ పరిస్థితులలో ఉన్న నాకు జక్కన్న సాయం చేశాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాకు యమదొంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు.
అయితే ఆ విజయాలతో నేను పెద్దగా సంతృప్తి చెందలేదు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం సంతృప్తినిస్తోంది. నటుడిగా ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు ఎన్టీఆర్. బాహుబలి సినిమా తర్వాత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు రెండేళ్లుగా జక్కన్న ఈ సినిమాను చెక్కుతున్నాడు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించనున్నాడు రాజమౌళి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…