NTR : డిప్రెష‌న్‌లోకి వెళ్లిన ఎన్టీఆర్‌ని రాజ‌మౌళి మాములు మ‌నిషిని చేశాడ‌ట‌..!

December 30, 2021 8:30 PM

NTR : టాలీవుడ్ టాప్ హీరోల‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక‌రు. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందులు ప‌డ్డ ఎన్టీఆర్‌కి య‌మ‌దొంగ చిత్రం మంచి జోష్‌ని అందించింది. ఆ త‌ర్వాత కొన్ని స‌క్సెస్‌లు, మ‌ళ్లీ ఫ్లాపులు. టెంప‌ర్ త‌ర్వాత ఇక ఎన్టీఆర్ వెనుదిర‌గి చూసుకోలేదు. వ‌రుస హిట్స్‌తో స్టార్ హీరోగా మారాడు. ఆయ‌న‌కు ఉన్న అభిమాన గ‌ణం ఏ పాటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు జూనియ‌ర్.

NTR went into depression at that time rajamouli took care of him

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జనవరి 7న రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్‌ తన డిప్రెషన్‌ గురించి బయటపెట్టాడు. 17 ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాను. రెండవ సినిమాకే స్టార్‌ స్టేటస్‌ చూశాను. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయాను.

గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌లో ఉన్న నాకు జ‌క్క‌న్న సాయం చేశాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాకు యమదొంగ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్‌ ట్రాక్‌లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు.

అయితే ఆ విజయాలతో నేను పెద్దగా సంతృప్తి చెందలేదు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం సంతృప్తినిస్తోంది. నటుడిగా ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు ఎన్టీఆర్. బాహుబలి సినిమా తర్వాత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు రెండేళ్లుగా జక్కన్న ఈ సినిమాను చెక్కుతున్నాడు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించనున్నాడు రాజమౌళి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now