NTR : 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసి.. తర్వాత పార్టీ కార్యక్రమాలలో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అప్పుడప్పుడూ ఆయన అభిమానులు ఎన్టీఆర్‌ని రాజకీయాలలోకి రావాలని పట్టుబడుతూ ఉండేవారు. కానీ దానిపై జూనియర్ సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. నందమూరి కుటుంబం సీరియస్‌గా స్పందించింది.
జూనియర్ ఎన్టీఆర్ ఆలస్యంగా స్పందించడతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తారక్‌ను తప్పుబట్టాయి. ఆ స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు దంపతుల పేర్లను ప్రస్తావించలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల పేర్లను ఉటంకించలేదు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ నాయకులు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం అభిమానులకు నచ్చడం లేదట. ఈ పరిణామాలు రుచించని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుప్పంలో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారట. వందల మంది అభిమానులు కుప్పంలో ఒకచోట మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత జై లవకుశ సినిమా స్పెషల్ షో వేయించుకున్నారట. టీడీపీ నేతలు తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…