NTR : కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల ర‌చ్చ‌.. ఏం జ‌రుగుతోంది ?

November 30, 2021 5:12 PM

NTR : 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసి.. తర్వాత పార్టీ కార్యక్రమాలలో కనిపించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తర్వాత సినిమాలపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. అప్పుడ‌ప్పుడూ ఆయ‌న అభిమానులు ఎన్టీఆర్‌ని రాజ‌కీయాల‌లోకి రావాల‌ని ప‌ట్టుబ‌డుతూ ఉండేవారు. కానీ దానిపై జూనియ‌ర్ సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. నందమూరి కుటుంబం సీరియస్‌గా స్పందించింది.

NTR : కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల ర‌చ్చ‌.. ఏం జ‌రుగుతోంది ?

జూనియర్‌ ఎన్టీఆర్ ఆలస్యంగా స్పందించడతో టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా తారక్‌ను తప్పుబట్టాయి. ఆ స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు దంపతుల పేర్లను ప్రస్తావించలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల పేర్లను ఉటంకించలేదు. జూనియర్‌ ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ నాయకులు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు నేరుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని కామెంట్స్‌ చేశారు.

ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ అభిమానులు నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్‌ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం అభిమానులకు నచ్చడం లేదట. ఈ పరిణామాలు రుచించని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుప్పంలో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారట. వందల మంది అభిమానులు కుప్పంలో ఒకచోట మీటింగ్‌ పెట్టుకున్నారు. ఆ తర్వాత జై లవకుశ సినిమా స్పెషల్‌ షో వేయించుకున్నారట. టీడీపీ నేతలు తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫాన్స్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now