Uber : ఊబ‌ర్ సేవ‌లు.. ఇక వ‌రంగ‌ల్‌లోనూ..!

November 19, 2021 3:50 PM

Uber : ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఊబ‌ర్ త‌న సేవ‌ల‌ను వ‌రంగ‌ల్‌లో ప్రారంభించింది. వ‌రంగ‌ల్ పౌరులు ప్ర‌స్తుతం ఊబ‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చ‌ని ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ఊబ‌ర్ సేవ‌లు మ‌న దేశంలో తొలుత 2013లో ప్రారంభం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే మొద‌టగా బెంగ‌ళూరులో ఈ సేవ‌ల‌ను ప్రారంభించారు. త‌రువాత క్ర‌మంగా అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు ఊబ‌ర్ త‌న సేవ‌ల‌ను విస్త‌రిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా వ‌రంగ‌ల్‌లోనూ ఊబ‌ర్ క్యాబ్ సేవ‌ల‌ను ప్రారంభించింది.

now warangal citizen can use Uber cab services

ఇక వ‌రంగ‌ల్‌లో క్యాబ్ సేవ‌ల‌ను ప్రారంభించ‌డంతో ఊబ‌ర్ ఖాతాలో 100 సిటీలు చేరాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 95 మిలియ‌న్ల మంది రైడ‌ర్లు, డ్రైవ‌ర్ల‌కు సేవ‌ల‌ను అందించిన‌ట్లు ఊబ‌ర్ తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఊబ‌ర్ ద్వారా కేవ‌లం క్యాబ్ స‌ర్వీస్‌లే కాకుండా.. ఊబ‌ర్ రెంట‌ల్స్, ఊబ‌ర్ క‌నెక్ట్‌, ఆటో, మోటో, ఊబ‌ర్ మెడిక్‌, ఎసెన్షియ‌ల్‌, లాస్ట్ మైల్ డెలివ‌రీ.. వంటి సేవ‌లు కూడా ల‌భిస్తున్నాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు ఊబ‌ర్ సేవ‌ల‌ను అందించింద‌ని ఆ సంస్థ ఇండియా అండ్ సౌత్ హెడ్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ శివ శైలేంద్ర‌న్ తెలిపారు.

ఈ ఏడాది కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్‌ను స్వ‌చ్ఛంద సంస్థ‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. త‌మ ప్లాట్‌ఫాంలో నవంబ‌ర్ 2021 వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మంది డ్రైవ‌ర్ల‌కు క‌నీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా తీసుకున్నార‌ని అన్నారు. త‌మ సేవ‌ల‌ను మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తామ‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment