గురువారం, జూన్ 11, 2026
గ్యాడ్జెట్స్

Nokia 2660 Flip : ఒక‌ప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న ఫ్లిప్ ఫోన్‌.. మ‌ళ్లీ విడుద‌ల చేసిన నోకియా.. ధ‌ర రూ.4వేలే..!

Nokia 2660 Flip : ఒక‌ప్పుడు నోకియా ఫోన్లు ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ ఫోన్ల‌లో మ‌డ‌త పెట్టే ఫోన్‌గా పేరుగాంచిన నోకియా ఫ్లిప్ ఫోన్‌కు ఎంతో ఆద‌ర‌ణ ఉండేది. దీన్ని చాలా మంది…

Nokia 2660 Flip : ఒక‌ప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న ఫ్లిప్ ఫోన్‌.. మ‌ళ్లీ విడుద‌ల చేసిన నోకియా.. ధ‌ర రూ.4వేలే..!

Nokia 2660 Flip : ఒక‌ప్పుడు నోకియా ఫోన్లు ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ ఫోన్ల‌లో మ‌డ‌త పెట్టే ఫోన్‌గా పేరుగాంచిన నోకియా ఫ్లిప్ ఫోన్‌కు ఎంతో ఆద‌ర‌ణ ఉండేది. దీన్ని చాలా మంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు అలాంటి డిజైన్‌తోనే మ‌రో నోకియా ఫోన్ అందుబాటులోకి వ‌చ్చింది. నోకియా మాతృ సంస్థ అయిన హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా 2660 ఫ్లిప్ పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌లో 4జి వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 2.8 ఇంచుల డిస్‌ప్లేను అమ‌ర్చారు. 1 గిగాహెడ్జ్ యూనిసోక్ సింగిల్ కోర్ ప్రాసెస‌ర్ ఉంది. 48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌ల‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఎస్‌30ప్ల‌స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ల‌భిస్తుంది.

Nokia 2660 Flip 4g volte feature phone launched in India
Nokia 2660 Flip

ఈ ఫోన్‌లో వీజీఏ బ్యాక్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియోను విన‌వ‌చ్చు. ఎంపీ3 ప్లేయ‌ర్ ఉంది. బ్లూటూత్ 4.2, 4జి వీవోఎల్‌టీఈ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 2జిపై 20 గంట‌ల మేర టాక్ టైమ్‌ను అందిస్తుంది.

నోకియా 2660 ఫ్లిప్ ఫీచ‌ర్ ఫోన్ బ్లాక్‌, రెడ్‌, బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌ల కాగా.. దీని ధ‌ర రూ.4,699 గా ఉంది. నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి