గురువారం, జూన్ 11, 2026
సినిమా

మాస్కు లేకుంటే.. ఇకపై సినిమా కూడా లేదు!

రోజురోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో కనపడితే అధిక జరిమానాలను వసూలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బయటకు…

మాస్కు లేకుంటే.. ఇకపై సినిమా కూడా లేదు!

రోజురోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో కనపడితే అధిక జరిమానాలను వసూలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇక రద్దీగా ఉండే మాల్స్ వంటి ప్రాంతాలలో మాస్కు లేనిదే లోపలికి అనుమతి లేదు.ఈ క్రమంలోనే పలు మాల్స్ బయట “నో మాస్క్ నో ఎంట్రీ” బోర్డులు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక పోతే థియేటర్లు కూడా ఓపెన్ కావడంతో జనాలు ఎక్కువగా సినిమాలకి వెళుతున్నారు. థియేటర్లలోకి కూడా మాస్కు లేనిదే ప్రవేశం లేదు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు కూడా “నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు”ఆదివారం దర్శనమిచ్చింది. కేవలం థియేటర్లకు మాత్రమే కాకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే ఈ మహమ్మారి బారినపడకుండా, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి