Niharika Konidela : డాక్టర్ నిహారికగా మారిన నిహారిక.. దెబ్బకి నాగబాబు నొప్పి తగ్గిందిగా..!

September 23, 2022 4:18 PM

Niharika Konidela : మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంతమంది ఉన్నా నటీమణులు మాత్రం నిహారిక ఒక్కతే. నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. నిహారిక ఎక్కడ ఉన్నా ఫన్నీగా సెటైర్లు, అల్లరి చేష్టలు, క్యూట్ గా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. నిహారిక కూడా తండ్రి పట్ల అమితమైన ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమతోనే నిహారిక డాక్టర్ గా మారి నాగబాబుకు చుక్కలు చూపించింది.

కొన్నిరోజులుగా నాగబాబు తన కుడిచేతికి గాయంతో కనిపిస్తున్నారు. వరుణ్ తేజ్ కొత్త మూవీ లాంచ్ లో కూడా నాగబాబు గాయంతోనే కనిపించారు. నాగబాబు గాయంతో ఇబ్బంది పడుతుంటే నిహారిక అల్లరి మాత్రం తగ్గడం లేదు. తన తండ్రి చేతి నొప్పి పోగొట్టేందుకు నిహారిక.. డాక్టర్ నిహారికగా మారింది. నాన్న చేయి నొప్పిగా ఉందా అంటూ ప్రేమగా పక్కన కూర్చుంది. అవునమ్మా షోల్డర్ నుంచి కిందివరకు బాగా పెయిన్ గా ఉందని నాగబాబు సమాధానమిచ్చారు. నీ నొప్పిని నేను తీసేస్తా అని నిహారిక అనగా పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే కాలేదు అని నాగబాబు అన్నారు.

Niharika Konidela and Naga babu latest photo viral
Niharika Konidela

ఏదైనా మంత్రం వేస్తావా ఏంటి అని అనగా.. నీ కెందుకు ఆ చేతికి ఉన్న నొప్పి తీసేస్తా అని.. రెండవ చేయి పట్టుకుని గట్టిగా కొరికేసింది. దీనితో నాగబాబు గట్టిగా అరిచారు. చూశారా ఆ చేయి నొప్పి తగ్గిపోయింది అని నిహారిక అనగా.. ఈ చేతికి వచ్చింది కదమ్మా అని సరదాగా అంటాడు. నిహారిక ఈ అల్లరి చేష్టలని నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ముల్లుని ముల్లుతోనే తీయడం అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీ ఇంట్లో ట్రై చేయొద్దు. ఇది డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో జరిగింది అని నాగబాబు ఫన్నీ కామెంట్ పెట్టారు. నాగబాబు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు మెగా అభిమానులు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now