Anushka Shetty : స్వీటీపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌.. కార‌ణం అదే..!

June 7, 2022 7:22 AM

Anushka Shetty : అనుష్క శెట్టి అస‌లు వివాదాల్లో చిక్కుకోదు. ఆమె అస‌లు సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఈమెకు ఆఫ‌ర్లు లేవు. మొన్నా మ‌ధ్య వ‌చ్చిన నిశ్శ‌బ్దం మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచింది. దీంతో మ‌ళ్లీ ఈమె తెర‌మ‌రుగు అయిపోయింది. అయితే త్వ‌ర‌లోనే న‌వీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇత‌ర హీరోయిన్ల‌లా అనుష్క శెట్టి గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేయ‌డం లేదు. అస‌లు త‌న అప్ డేట్స్ గురించి కూడా ఆమె సోష‌ల్ మీడియాలో ఏమీ పోస్ట్ చేయ‌డం లేదు. కానీ లేటెస్ట్‌గా ఆమె చేసిన పోస్ట్‌కు పాజిటివ్ గా స్పంద‌న రాక‌పోగా.. నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

అనుష్క శెట్టి ఇటీవ‌లే త‌న సోద‌రుడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌నతో క‌ల‌సి తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే అది ఏమాత్రం క్లారిటీ లేదు. చూస్తుంటే ఆమె త‌న ద‌గ్గ‌ర ఉన్న ఫిజిక‌ల్ ఫొటోను స్కాన్ చేసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇత‌ర హీరోయిన్లు ఓ వైపు అద్భుత‌మైన క్లారిటీ కలిగిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటే.. నువ్వ ఇలాంటి ఫొటోను పోస్ట్ చేశావేంటి.. అస‌లు ఎలాంటి ఫొటోల‌ను షేర్ చేయాలో తెలియ‌దా.. అంటూ స్వీటీపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తూ.. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

netizen troll Anushka Shetty this is the reason
Anushka Shetty

కాగా అనుష్క శెట్టి 2005లో వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో సినీ తెర‌కు ప‌రిచయం అయింది. అందులో సాషాగా ఆక‌ట్టుకుంది. ఈ మూవీలో నాగార్జున‌తోపాటు సోనూసూద్‌, ఆయేషా ట‌కియాలు న‌టించారు. త‌రువాత అనేక సినిమాలు చేసింది. కానీ చాలా వ‌ర‌కు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ర‌వితేజ‌తో చేసిన విక్ర‌మార్కుడు, లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధ‌తి, త‌మిళంలో సూర్య‌తో క‌ల‌సి చేసిన సింగం 2, బాహుబ‌లి, మిర్చి వంటి సినిమాలు ఈమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఈమె చివ‌రిసారిగా 2020లో నిశ్శ‌బ్దం అనే మూవీతో ప‌ల‌క‌రించింది. త‌రువాత నుంచి ఖాళీగానే ఉంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment