ఆదివారం, జూలై 5, 2026
వార్తలు

Amitabh Bachchan : అమితాబ్‌ బచ్చన్‌కు అవమానం.. ముసలోడా అని కామెంట్‌ చేసిన నెటిజన్‌..!

Amitabh Bachchan : బాలీవుడ్‌ సీనియర్‌ మోస్ట్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాయి. బిగ్‌బీగా ఈయనను అందరూ పిలుచుకుంటారు. కేవలం హిందీ మాత్రమే కాదు.. దక్షిణాది…

Amitabh Bachchan : అమితాబ్‌ బచ్చన్‌కు అవమానం.. ముసలోడా అని కామెంట్‌ చేసిన నెటిజన్‌..!

Amitabh Bachchan : బాలీవుడ్‌ సీనియర్‌ మోస్ట్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాయి. బిగ్‌బీగా ఈయనను అందరూ పిలుచుకుంటారు. కేవలం హిందీ మాత్రమే కాదు.. దక్షిణాది వారికి కూడా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలు అంటే ఆసక్తి ఉంటుంది. ఇక ఈయనతో వర్మ చేసిన సర్కార్‌ మూవీ అయితే ఒక రేంజ్‌లో సంచలనం సృష్టించింది. కాగా బిగ్‌బీ ప్రస్తుతం సినిమాలతోపాటు టీవీ షోస్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్‌ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంపై పోస్టులు పెడుతుంటారు. అయితే ఆయన పెట్టే పోస్టులపై కొన్ని సార్లు ఆయనపై ట్రోల్స్‌, విమర్శలు వస్తుంటాయి. కరోనా సమయంలో ఆయన ఖరీదైన కారు కొంటే.. ఒక వైపు ప్రజలు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతుంటే.. మీరు కారు కొని షికారు చేయాలా.. ఇలాంటి పోస్టులు పెట్టడం అవసరమా.. అని నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. ఇక ఆయనకు కోవిడ్ సోకి హాస్పిటల్‌ చేరినప్పుడు పోస్టులు పెడితే.. ఆయన చనిపోవాలని కోరుకుంటున్నామని.. కొందరు ఆయనను దారుణంగా విమర్శించారు. ఇక ఇప్పుడు కూడా ఆయనను కొందరు నెటిజన్లు అలాగే విమర్శిస్తున్నారు.

netizen comment on Amitabh Bachchan he has given reply
Amitabh Bachchan

అమితాబ్‌ బచ్చన్‌ లేటెస్ట్‌గా ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో గుడ్‌ మార్నింగ్‌ అని ఉంది. సాధారణంగా ఇలాంటి పోస్టులను ఉదయం 9 లోపే పెట్టాలి. కానీ ఆయన ఉదయం 11.30 గంటలకు పెట్టారు. దీంతో నెటిజన్లకు మళ్లీ ఆయుధం లభించినట్లు అయింది. దీంతో నెటిజన్లు ఆయనపై మరోమారు విరుచుకుపడుతున్నారు. ఆయనను ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు టైం ఎంతైంది.. ఇప్పుడా గుడ్‌ మార్నింగ్‌ చెప్పేది.. అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేయగా.. ఒక నెటిజన్‌ మాత్రం బిగ్‌బీని అవమానించాడు. ఆయనను.. ముసలోడా.. ఇది మధ్యాహ్నం.. అని అన్నాడు. ఇలా ఆ నెటిజన్‌ దారుణంగా అమితాబ్‌ను అవమానించాడు.

అయితే అమితాబ్‌ అందుకు స్పందించారు. మీరు చాలా కాలం బతకాన్ని కోరుకుంటున్నా.. కానీ మిమ్మల్ని ఎవరూ ముసలోడు.. అని పిలవొద్దని ఆశిస్తున్నా.. అంటూ దీటుగా బదులిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, గుడ్‌బై, ప్రాజెక్ట్‌ కె, బటర్‌ఫ్లై వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి