గురువారం, జూన్ 11, 2026
ఉద్యోగాలు

NCL రిక్రూట్‌మెంట్ 2026: 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు.. డిప్లొమా చేసిన వారికి సువర్ణావకాశం!

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 270 ఖాళీలను భర్తీ చేయనుంది.

NCL రిక్రూట్‌మెంట్ 2026: 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు.. డిప్లొమా చేసిన వారికి సువర్ణావకాశం!
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. Photo Credit: Northern Coalfields Limited.
Northern Coalfields Limited (NCL) Assistant Foreman Trainee Recruitment 2026 notification.
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. Photo Credit: Northern Coalfields Limited.

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 270 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించినవి కాగా ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2026 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్ప‌వ‌చ్చు.

ఖాళీల వివరాలు, అర్హతలు..

అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) పోస్టులకు మొత్తం 270 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి 3 సంవత్సరాల డిప్లొమా తప్పనిసరి. అదనంగా అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అర్హతలు ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు..

  • దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ www.nclcil.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి.
  • దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026
  • చివరి తేదీ: మార్చి 5, 2026 (రాత్రి 11:59 వరకు)
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,180
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది
  • ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర ఆపరేషనల్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో టెక్నికల్ పరిజ్ఞానం, రీజనింగ్, అవగాహన, ఆప్టిట్యూడ్ అంశాలు ఉంటాయి.
సీబీటీ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష నిర్వహిస్తారు. తుది ఎంపిక పూర్తిగా సీబీటీ ఫలితాలు, అర్హత ప్రమాణాల ఆధారంగా ఉంటుంది.

గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు NCL అధికారిక వెబ్‌సైట్ www.nclcil.in లోని పూర్తి నోటిఫికేషన్‌ను చదవాలి. అధికారిక నోటిఫికేష‌న్‌, వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి