బుధవారం, జూలై 8, 2026
వార్తలు

Nayanthara Wedding Saree Cost : త‌న పెళ్లి సంద‌ర్భంగా న‌య‌న‌తార ధ‌రించిన ఈ చీర‌, ఆభ‌ర‌ణాల ధ‌ర ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

Nayanthara Wedding Saree Cost : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం విదిత‌మే. జూన్ 9న మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్ హోట‌ల్‌లో వీరు వివాహం చేసుకున్నారు. కుటుంబ…

Nayanthara Wedding Saree Cost : త‌న పెళ్లి సంద‌ర్భంగా న‌య‌న‌తార ధ‌రించిన ఈ చీర‌, ఆభ‌ర‌ణాల ధ‌ర ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

Nayanthara Wedding Saree Cost : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం విదిత‌మే. జూన్ 9న మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్ హోట‌ల్‌లో వీరు వివాహం చేసుకున్నారు. కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌తోపాటు సెల‌బ్రిటీలు భారీ సంఖ్య‌లో వీరి వివాహానికి హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. ఇక వీరు త‌మ పెళ్లి సంద‌ర్భంగా త‌మిళ‌నాడు అంత‌టా ప‌లు చోట్ల మొత్తం 1 ల‌క్ష మందికి అన్న‌దానం కూడా చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు.

అయితే న‌య‌న‌తార క్రిస్టియ‌న్ అయిన‌ప్ప‌టికీ భ‌ర్త హిందూ క‌నుక హిందూ సంప్ర‌దాయ ప్ర‌కార‌మే వివాహం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా న‌య‌న‌తార ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు చీర‌తోపాటు ప‌చ్చ‌ల ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించింది. అయితే విగ్నేష్ శివ‌న్ కుటుంబ సంప్ర‌దాయం ప్ర‌కారం వ‌ధువు ఎరుపు రంగు చీర‌ను ధ‌రించాల‌ట‌. క‌నుక‌నే న‌య‌న‌తార కూడా అదే చీర‌ను ధ‌రించింది. ఇక ఈ చీర‌ను 15 మంది ప్ర‌త్యేకంగా డిజైన్ చేశార‌ట‌. ఇందుకు గాను రూ.25 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యింద‌ట‌. ముంబైలో ఈ చీర‌ను డిజైన్ చేశారు. ఇందుకు వాడిన వ‌స్త్రాన్ని విదేశాల నుంచి తెప్పించారు.

Nayanthara Wedding Saree Cost do you know how much it is
Nayanthara Wedding Saree Cost

ఇక ఈ పెళ్లిలో న‌య‌న‌తార ప‌చ్చ‌ల ఆభ‌ర‌ణాల‌ను ఎక్కువ‌గా ధ‌రించింది. ఆమె ధ‌రించిన మొత్తం ఆభ‌ర‌ణాల విలువ రూ.3 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆభ‌ర‌ణాల‌ను విగ్నేష్ త‌ల్లిదండ్రులు న‌య‌న‌తార‌కు బ‌హుమ‌తిగా ఇచ్చార‌ట‌. వాటినే ఆమె పెళ్లిలో ధ‌రించింది. ఇక న‌య‌న‌తార కూడా త‌న భ‌ర్త విగ్నేష్‌కు పెళ్లి కానుక‌గా రూ.20 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని అంద‌జేసింది. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి