Natu Natu Song : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ పెంచారు. తాజాగా సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్ వీడియో)ను విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.
నాటు నాటు పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చూస్తుంటే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. పూనకాలు వచ్చేలా వీరిద్దరు చిందులు వేశారు. చూస్తుంటే ఈ సినిమాతో రాజమౌళి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…