గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Natu Natu Song : నాటు నాటు పాట‌కు ర‌చ్చ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌..!

Natu Natu Song : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో  రాజమౌళి  అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్,…

Natu Natu Song : నాటు నాటు పాట‌కు ర‌చ్చ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌..!

Natu Natu Song : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో  రాజమౌళి  అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం.

Natu Natu Song launched fans are very happy

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ స్పీడ్ పెంచారు. తాజాగా  సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్‌ వీడియో)ను విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.

నాటు నాటు పాట‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్ చూస్తుంటే ప్రేక్ష‌కులు పిచ్చెక్కిపోతున్నారు. పూన‌కాలు వ‌చ్చేలా వీరిద్ద‌రు చిందులు వేశారు. చూస్తుంటే ఈ సినిమాతో రాజ‌మౌళి బాక్సాఫీస్ షేక్ చేసేలా క‌నిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి