OTT : ఈ వారం ఓటీటీల్లో రానున్న సినిమాలు ఇవే.. ఒకే రోజు మూడు పెద్ద మూవీలు..!

May 15, 2022 2:29 PM

OTT : ఈమధ్య కాలంలో అనేక కొత్త సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ అవుతున్నాయి. థియేటర్లలో వచ్చిన కొన్ని రోజులకే ఓటీటీల్లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా హిట్‌ అయితే ఓకే. లేదంటే త్వరగానే ఓటీటీలకు ఇస్తున్నారు. దీంతో మేకర్స్‌కు కాస్త లాభం కలుగుతోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఫ్లాప్‌ అవుతుండడంతో అవన్నీ ఓటీటీల బాట పడుతున్నాయి. ఇక వీటితోపాటు పలు ఇతర చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. కాగా ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు గాను డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న జీ5 సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని ఈ నెల 20వ తేదీన రిలీజ్‌ చేయనుంది. ఇప్పటికే ఓటీటీ వెర్షన్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోనూ హిట్‌ అవుతుందని అంటున్నారు.

movies releasing on May 20th 2022 on OTT apps
OTT

ఇక మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఏకంగా రూ.84 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. అయితే ఈ మూవీ కూడా ఈ వారమే ఓటీటీలో రానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకోగా.. అదే 20వ తేదీన ఈ సినిమాను కూడా స్ట్రీమ్‌ చేయనున్నారు. దీంతో ఒకే రోజు రెండు పెద్ద మూవీల రిలీజ్‌తో ఓటీటీలు సందడి చేయనున్నాయి. ప్రేక్షకులు ఇంట్లో వినోదాల విందును అందుకోనున్నారు.

ఇక శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భళా తందనాన మూవీ కూడా ఈ నెల 20వ తేదీనే రిలీజ్ అవుతోంది. దీన్ని డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో వీక్షించవచ్చు. దీంతోపాటు మే 20వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో ఎస్కేప్‌ లివ్‌ అనే హిందీ టీవీ షోను ప్రసారం చేయనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ షోను రూపొందించారు. అలాగే మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన 12th Man అనే మూవీని కూడా మే 20వ తేదీనే రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతోంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో ఈ సినిమాను చూడవచ్చు. మిస్టరీ, థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ క్రమంలోనే ఒకే రోజు ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య, 12th Man వంటి మూడు పెద్ద సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ అవుతుండడం.. ప్రేక్షకులకు ఎంతగానో సంతోషాన్నిస్తోంది. ఈ వారం ఈ సినిమాలతో ప్రేక్షకులు విందు భోజనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఓటీటీలలో వస్తున్న ఈ సినిమాల్లో ఏది హిట్‌ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment