Meena Husband : బాబోయ్‌.. మీనా భ‌ర్త‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ?

July 3, 2022 10:20 AM

Meena Husband : తెలుగు ప్రేక్ష‌కుల‌కు మీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద‌క్షిణాది భాష‌ల‌తోపాటు హిందీలోనూ ఈమె న‌టించింది. అప్ప‌ట్లో చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి అగ్ర హీరోలు అంద‌రితోనూ ఈమె యాక్ట్ చేసింది. అయితే వివాహం కార‌ణంగా కొంత కాలం పాటు ఈమె సినిమాల‌కు దూరంగా ఉంది. త‌రువాత కుమార్తె నైనిక జ‌న్మించిన అనంత‌రం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోన ఈమె అద‌ర‌గొడుతోంది. అనేక చిత్రాల్లో ఈమె న‌టించ‌గా.. అవి హిట్ అయ్యాయి.

అయితే మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ ఇటీవ‌ల మృతి చెందారు. క‌రోనా కార‌ణంగా ఆయ‌న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటూ క‌న్నుమూశారు. అయితే జ‌న‌వ‌రి నెల‌లో మీనా కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డగా.. అంద‌రూ కోలుకున్నారు. కానీ విద్యాసాగ‌ర్ మాత్రం కోలుకోలేక‌పోయారు. ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్ష‌న్ బాగా ఎక్కువైంది. దీంతోనే ఆయ‌న చ‌నిపోయారు. కానీ ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి. మీనాకు, ఆమె భ‌ర్త విద్యాసాగ‌ర్‌కు మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. క్ష‌ణికావేశంలో ప‌ర‌స్ప‌రం అరుచుకున్నార‌ని.. దీంతో మ‌న‌స్థాపం చెందిన విద్యాసాగ‌ర్ కు ఆరోగ్యం క్షీణించింద‌ని.. అందువ‌ల్లే ఆయ‌న చ‌నిపోయార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి.

Meena Husband Vidya Sagar assets value do you about it
Meena Husband

అయితే మీనా ఈ వార్త‌ల‌పై స్పందిస్తూ త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయొద్ద‌ని.. తాను ఎంతో ప్రేమించే వ్య‌క్తి దూరం అయ్యాడ‌ని.. క‌నుక త‌మ‌కు ఇప్పుడు ప్రైవ‌సీ కావాల‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కోరింది. అయితే విద్యాసాగ‌ర్‌కు ఉన్న ఆస్తుల విలువ‌పై ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. ఆయ‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన‌ప్ప‌టికీ మంచి టాలెంటెడ్ అని స‌మాచారం. అందువ‌ల్లే ఆయ‌న‌కు కొన్ని కంపెనీల్లో వాటా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆస్తులు విలువ రూ.250 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఆయ‌న చ‌నిపోయారు క‌నుక ఆయ‌న ఆస్తి మొత్తం మీనాకే ద‌క్క‌నుంది. కానీ మీనా కూడా సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది. క‌నుక ఆమెకు కూడా బాగానే ఆస్తులు ఉంటాయ‌ని స‌మాచారం. ఇక ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment