గురువారం, జూన్ 11, 2026
food

Masala Chai Powder : ఇలా మసాలా ఛాయ్ పౌడర్ తో.. ఛాయ్ తయారు చేస్తే.. ఆహా అంటారు..!

Masala Chai Powder : ప్రతి రోజూ చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం టీతోనే వారి రోజుని మొదలు పెడుతుంటారు. అయితే మామూలు టీ కాకుండా ఈ విధంగా టీ తీసుకుంటే ఎంతో…

Masala Chai Powder : ఇలా మసాలా ఛాయ్ పౌడర్ తో.. ఛాయ్ తయారు చేస్తే.. ఆహా అంటారు..!

Masala Chai Powder : ప్రతి రోజూ చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం టీతోనే వారి రోజుని మొదలు పెడుతుంటారు. అయితే మామూలు టీ కాకుండా ఈ విధంగా టీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు ఒక మంచి టీ మసాలా రెసిపి గురించి చూసేద్దాం. ఇలా కనుక టీ ని తయారు చేసుకుంటే టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఛాయ్ మసాలాని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ పెట్టి అందులో మూడు పెద్ద స్పూన్లతో యాల‌కులు వేయండి. 10 గ్రాముల వరకు దాల్చిన చెక్కని వేయండి.

రెండు స్పూన్ల సోంపు కూడా ఇందులో వేసుకోండి. 10 గ్రాముల వరకు నల్ల మిరియాల‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు పెద్ద యాల‌కులు వేసుకోండి. వీటిని నల్ల యాల‌కులు అంటారు. నల్ల యాల‌కులు వేసుకునేటప్పుడు తొక్క తీసేసి గింజలని వేసుకోవాలి. దీనిలో ఒక జాజికాయని కూడా వేసేయండి. ఎనిమిది గ్రాముల వరకు లవంగాలను కూడా ఇందులో వేసేయాలి.

Masala Chai Powder make tea with this for taste
Masala Chai Powder

వీటిని అన్నింటినీ మీరు బాగా వేయించుకుని చల్లార్చండి. 10 గ్రాముల అతి మధురం పొడి, పటిక బెల్లం 30 గ్రాములు, శొంఠి పొడి 10 గ్రాముల వరకు తీసుకుని పక్కన ఉంచుకోండి. వేయించుకున్న వాటితోపాటు పటిక బెల్లం ముక్కలు, అతిమధురం, శొంఠి కూడా వేసి మెత్తగా వీటిని మిక్సీ పట్టుకోండి. దీనిని మీరు స్టోర్ చేసుకుని ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు.

ఇప్పుడు టీ కోసం మీరు ఒక గిన్నెలో నీళ్లు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక అందులో టీ పొడి, పంచదార వేసి బాగా మరిగాక అందులో పాలు పోసుకోవాలి. టీ బాగా మరిగిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఇందులో వేయాలి. తర్వాత టీ ఫిల్టర్ తో వడకట్టుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఈ టీ ఉంటుంది. కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి