Manoj Desai : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. లైగర్ రిజల్ట్ విజయ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఎఫెక్ట్ విజయ్ ని చాలాకాలం వెంటాడే సూచనలు ఉన్నాయి. ఈ మూవీని కొన్న ఓ థియేటర్ యజమాని విజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తెలుగులో లైగర్ ఓపెనింగ్స్ పరంగా ఫర్లేదనిపించినా ఇతర భాషల్లో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా లైగర్ హిందీ వర్షన్ నెగెటివ్ టాక్ తో భారీగా నష్టపోయింది. విపరీతమైన హైప్ క్రియేట్ కావడంతో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ క్రమంలో ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని విజయ్ దేవరకొండను తిట్టిపోశాడు. మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో.. లైగర్ విడుదలకు ముందు విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఓపెనింగ్స్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు. కావాలంటే నా సినిమాను బాయ్ కాట్ చేసుకోండని చెప్పి విజయ్ పెద్ద తప్పు చేశాడని విమర్శించాడు. విజయ్ నువ్వు కొండవి కావు అనకొండవు. లైగర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వం కోల్పోయాను. నీ మాటలు అడ్వాన్స్ బుకింగ్స్ రాకుండా చేశాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
నెపో కిడ్ అనన్య పాండే హీరోయిన్ కావడం, కరణ్ జోహార్ నిర్మాతగా ఉండడంతోపాటు ప్రెస్ మీట్స్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ నచ్చని నెటిజెన్స్ బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. అదే టైంలో విజయ్ దేవరకొండ కావాలంటే నా సినిమా బాయ్ కాట్ చేసుకోండి, నచ్చితేనే చూడండి అంటూ పొగరుగా మాట్లాడాడు. ఇవీ మూవీపై ఎఫెక్ట్ చూయించాయని ఆయన ఆరోపించాడు. నీలానే మా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండని చెప్పి అమీర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ నష్టపోయారు. నీ పొగరు వలన లైగర్ కి ఓపెనింగ్స్ దక్కలేదంటూ మనోజ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం మనోజ్ దేశాయ్ ఇంటర్వ్యూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…