Ramarao On Duty : భారీ అంచనాల మధ్య జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించాడు. రవితేజ టీం వర్క్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. అయితే ఉన్నంతలో విడుదలైన రోజు మార్నింగ్ షోకు ఓపెనింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లెక్కలను తారుమారు చేస్తూ బోల్తా పడింది.
1993లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శరత్ మండవ. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ అందులో పావు వంతు కూడా రికవరీ సంపాదించలేకపోయింది. మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. క్రాక్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రవితేజ, మరలా ఖిలాడి చిత్రంతో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ కూడా రవితేజకు సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.
భారీ అంచనాల నడుమ జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీ లో రిలీజై సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీ రైట్స్ ని సోనీ లివ్ వారు కొనుగోలు చేశారు. దాదాపు ఆరు వారాల తర్వాత అంటే వచ్చే నెల సెప్టెంబర్ 15 నుంచి ఈ చిత్రం ఆ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…