గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ramarao On Duty : ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ.. ఎందులో అంటే..?

Ramarao On Duty : భారీ అంచనాల మధ్య జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రామారావు ఆన్‌ డ్యూటీ. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శరత్‌…

Ramarao On Duty : ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ.. ఎందులో అంటే..?

Ramarao On Duty : భారీ అంచనాల మధ్య జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రామారావు ఆన్‌ డ్యూటీ. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శరత్‌ మండవ తెరకెక్కించాడు. రవితేజ టీం వర్క్స్,  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ  బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. అయితే ఉన్నంతలో విడుదలైన రోజు మార్నింగ్ షోకు ఓపెనింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లెక్కలను తారుమారు చేస్తూ బోల్తా పడింది.

1993లో జరిగిన కొన్ని యదార్థ‌ సంఘటనల‌ ఆధారంగా ఈ  సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శరత్‌ మండవ. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.  కానీ అందులో పావు వంతు కూడా రికవరీ సంపాదించలేకపోయింది.  మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రేక్షకులను  ఆకట్టుకోలేకపోతున్నాయి. క్రాక్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రవితేజ, మరలా ఖిలాడి చిత్రంతో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ  కూడా రవితేజకు సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.

Ramarao On Duty movie to steam on OTT know the app and details
Ramarao On Duty

భారీ అంచనాల నడుమ జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీ లో రిలీజై సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీ రైట్స్ ని సోనీ లివ్‌ వారు కొనుగోలు చేశారు. దాదాపు ఆరు వారాల తర్వాత అంటే వచ్చే నెల సెప్టెంబర్ 15 నుంచి ఈ చిత్రం ఆ యాప్‌ లో స్ట్రీమింగ్ కానుంది. మరి రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి