Charmy Kaur : చార్మి వ‌ల్ల నిండా మునిగిన పూరీ జ‌గ‌న్నాథ్‌..? ఆమెను వ‌దిలేస్తే త‌ప్ప బాగుప‌డ‌డా..?

Charmy Kaur : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన‌ చిత్రం లైగర్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించ‌గా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా  విడుద‌లైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన మొదటి నుంచి ఛార్మి ఈ బ్యానర్ పై నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతోంది. కనెక్ట్స్ బ్యానర్ పై మొదటిగా తెరకెక్కిన చిత్రం జ్యోతిలక్ష్మి. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఒక ఇస్మార్ట్ శంకర్ తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో పూరీ జగన్నాథ్ ఆస్తులను మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇస్మార్ట్‌ శంకర్ విజయంతో వారు కోల్పోయిన ఆస్తులను తిరిగి పొందారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా అందుకున్న సక్సెస్‌తో పూరీ.. లైగర్ సినిమాను తెరకెక్కించాడు.

Charmy Kaur

లైగర్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి, హీరో విజయ్ దేవరకొండకి మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఈ చిత్రానికి చార్మి కూడా నిర్మాణ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టింది. అందుకే ఈ చిత్ర ప్రమోషన్లో ఛార్మీ హడావిడి చాలా చేసింది. విజయ్ బంగారు కొండ, పూరీ ఒక సెన్సేషనల్ అంటూ తెగ గొప్పలు చెప్పేసింది. సినిమా హిట్ అయితే వేరే విధంగా ఉండేది. కానీ లైగర్  చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎంతసేపూ ఛార్మి ధ్యాసలోనే బతికితే, నువ్వు కొన్నాళ్లకు డైరెక్టర్ అనే విషయాన్ని జనాలు మర్చిపోతారు.. అంటూ పూరీ జగన్నాథ్ ని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అసలు ఛార్మీ వల్ల పూరీకి ఒరుగుతుందేంటీ అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. అంతేకాదు, అసలు పూరీ.. చార్మీని వదిలేస్తే గానీ సక్సెస్‌ దారిలోకి రాలేడు అంటూ చెప్పుకుంటున్నారు.

నిజంగా ఇది ఎప్పటికి జరుగుతుందో గానీ, ఛార్మితో కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత పూరీకి అంతా లాసే మిగిలింది. ఇంకా చెప్పాలి అంటే పూరీ ఛార్మితో కనెక్ట్స్ బ్యానర్ పై  జనగణమన తెరకెక్కుతోంది. ఇప్పుడు పూరీ సినిమాలు టీజర్‌కి ఎక్కువ ట్రైలర్‌కి తక్కువ అని ప్రేక్షకులు డిసైడ్ అవుతున్నారు. ఈ ప్రభావం జనగణమన చిత్రంపై కూడా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సక్సెస్ చిత్రాల‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్, ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఛార్మి వల్ల పూరీకి మైనస్ అనే విషయం ఎప్పుడు గ్రహిస్తాడో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM