Liger Radhe Shyam : అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు విజయ్ ఒకే తప్పు చేశారా..?

Liger Radhe Shyam : ఏంటి విజయ్.. ఆగస్టు 25న ఇండియా మొత్తం షేక్ అవుతుంది అన్నావ్.. సినిమా చూసిన వాళ్లకి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నావ్.. చూడడానికి ఏముంది అక్కడ, మీ మాటల్లో ఉన్న‌ క్రేజ్ సినిమాల్లో లేదు.. అంటూ థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సినిమాని చెత్త చెత్త చేశారు అంటూ తిట్టుకుంటూ బయటకు వస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఎలాంటి చెత్త టాక్ ను సొంతం చేసుకుందో వేరే చెప్పనవసరం లేదు. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా పూరీని, విజయ్ ని సెటైర్లతో ఏకిపారేస్తున్నారు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి జంటగా నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. మైక్ టైసన్ వంటి గొప్ప ప్రముఖుడు చిత్రంలో నటించినప్పుడు సినిమా ఏ రేంజ్ లో ఉండాలి. కథలో  కంటెంట్, డైరెక్షన్ పూర్ గా ఉండడం, పూరీ జగన్నాథ్ రేంజ్ సినిమా కాకపోవడంతో అభిమానుల‌కు భారీ స్థాయిలో నిరాశ మిగిలింది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేది విజయ్ దేవరకొండ డైలాగ్స్ కోసమే. విజయ్ నటన పరంగా మెప్పించినా నత్తి సుత్తి అంటూ విజయ్ దేవరకొండలో ఉండే రియల్ టాలెంట్ ని చంపేసి  సినిమాను చెత్త చెత్త చేశాడు పూరీ.. అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.

Liger Radhe Shyam

టాప్ హీరోని కాస్తా ఫ్లాప్ హీరోని చేశావంటూ పూరీపై సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే లైగర్ చిత్రంలో మరో మిస్టేక్ కూడా ఉంది. అచ్చు పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన రాధే శ్యామ్ సినిమా కోసం ఏదైతే తప్పు చేశాడో, ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే తప్పు చేశాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న మన టాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కంటే ఎక్కువ బాలీవుడ్ పైనే మక్కువ చూపిస్తున్నారు. మన తెలుగు జనాలు ఒక సినిమా ఎలా ఉండాలని కోరుకుంటారో అనే విషయాన్ని మరిచిపోతున్నారు హీరోలు. పాన్ ఇండియా క్రేజ్ లో పడి బాలీవుడ్ హంగులు అద్దుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఉండే హీరో అంటే ప్రభాస్ అని వినిపిస్తుంది.

ఆయన రాధే శ్యామ్ సినిమాను తెలుగు ప్రేక్షకుల‌ రేంజ్ లో కాకుండా బాలీవుడ్ స్థాయిలో తీసి సినిమాకి లేనిపోని హంగూ ఆర్భాటాలు చేసి చివరకు అట్టర్ ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాకి అదే తప్పు చేశాడు అంటూ జనాలు చెప్తున్నారు. తెలుగు రేంజ్ ని ఊహించుకోకుండా ప్రతి ప్రమోషన్స్ లో బాలీవుడ్ కి పెద్దపీట‌ వేస్తూ విజయ్ చూపించిన యాటిట్యూడ్, పొగరుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన కెరీర్ ని నాశనం చేసే స్థాయికి తెచ్చుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిత్రం విడుదల కాకముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాల‌ను పెంచేస్తూ ఉంటే చివరకు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. ఇక‌నైనా హీరోలు ఇలాంటి త‌ప్పులు చేయ‌క‌పోతే సినిమాలు క‌నీసం తెలుగులోనైనా నిలుస్తాయి. లేదంటే కెరీర్ మొత్తం నాశ‌నం అవ‌డం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM