Redmi Note 11 SE : మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ పేరిట విడుదలైన ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్‌ను 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లోనే రిలీజ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది.
ఈ ఫోన్‌కు ఐపీ53 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి తదితర ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయగా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చార్జర్‌ను ఇవ్వడం లేదు. కానీ రూ.499 విలువ చేసే చార్జర్‌ను రూ.199 కే కొనుగోలు చేసేలా ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇక రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ బై ఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.13,499 కాగా ఆగస్టు 31వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.1000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…