Manoj Desai : విజయ్ నీకు పొగ‌రు.. అందువల్లే సర్వం కోల్పోయానంటూ.. ఓ రేంజ్ లో తిట్టాడు..!

August 27, 2022 5:06 PM

Manoj Desai : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. లైగర్ రిజల్ట్ విజయ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఎఫెక్ట్ విజయ్ ని చాలాకాలం వెంటాడే సూచనలు ఉన్నాయి. ఈ మూవీని కొన్న ఓ థియేటర్ యజమాని విజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తెలుగులో లైగర్ ఓపెనింగ్స్ పరంగా ఫ‌ర్లేదనిపించినా ఇతర భాషల్లో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా లైగర్ హిందీ వర్షన్ నెగెటివ్ టాక్ తో భారీగా నష్టపోయింది. విపరీతమైన హైప్ క్రియేట్ కావడంతో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ క్రమంలో ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని విజయ్ దేవరకొండను తిట్టిపోశాడు. మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో.. లైగర్ విడుదలకు ముందు విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఓపెనింగ్స్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు. కావాలంటే నా సినిమాను బాయ్ కాట్ చేసుకోండని చెప్పి విజయ్ పెద్ద తప్పు చేశాడని విమర్శించాడు. విజయ్ నువ్వు కొండవి కావు అనకొండవు. లైగర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వం కోల్పోయాను. నీ మాటలు అడ్వాన్స్ బుకింగ్స్ రాకుండా చేశాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Manoj Desai very angry on Vijay Devarakonda
Manoj Desai

నెపో కిడ్ అనన్య పాండే హీరోయిన్ కావడం, కరణ్ జోహార్ నిర్మాతగా ఉండడంతోపాటు ప్రెస్ మీట్స్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ నచ్చని నెటిజెన్స్ బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. అదే టైంలో విజయ్ దేవరకొండ కావాలంటే నా సినిమా బాయ్ కాట్ చేసుకోండి, నచ్చితేనే చూడండి అంటూ పొగరుగా మాట్లాడాడు. ఇవీ మూవీపై ఎఫెక్ట్ చూయించాయని ఆయన ఆరోపించాడు. నీలానే మా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండని చెప్పి అమీర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ నష్టపోయారు. నీ పొగరు వలన లైగర్ కి ఓపెనింగ్స్ దక్కలేదంటూ మనోజ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం మనోజ్ దేశాయ్ ఇంటర్వ్యూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now