Mani Sharma :మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్భుతమైన సంగీతంతో శ్రోతలని ఉర్రూతలూగించేవాడు. ఎక్కువగా సినిమా ఆల్భమ్స్‌లో మణిశర్మ పేరే ఉండేది. రాను రానూ ఆయనకు క్రేజ్ తగ్గింది. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మణిశర్మ మళ్లీ ముంజుపుకున్నాడు. వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఆచార్య చిత్రం నుండి విడుదలైన లాహే లాహే అనే పాటకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ కూడా రాబట్టింది. అయితే ‘ఆచార్య’ మూవీ టీమ్ సెకండ్ సింగిల్ ‘నీలాంబరి’ పాటను రీసెంట్‌గా విడుదల చేసింది. ‘నీలాంబరి’ అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. అయితే ఈ పాట అంతగా ఆకట్టుకోలేకపోతుందనే టాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన థమన్, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌లతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. మణిశర్మ పాత స్టైల్‌లోనే కంపోజ్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆయన గతంలో అద్భుతమైన మ్యూజిక్ అందించినప్పటికీ ఇప్పుడు అంతగా ఇవ్వలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథనే ఆచార్య మూవీ. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…