Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 సీజన్ రాను రాను మరింత ఆసక్తిగా మారుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చే సరికి ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంటోంది. అయితే లీకు వీరుల కారణంగా ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అవబోయేది ఎవరో తెలిసిపోతోంది. దీంతో ఒక రోజు ముందుగానే ప్రేక్షకులకు థ్రిల్ లభిస్తోంది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరిల గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. వారిద్దరూ ఆరంభం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. గేమ్‌లను కలసి ఆడుతున్నారు. అలాగే సేమ్ కంటెస్టెంట్లను నామినేట్ చేస్తున్నారు. దీంతో తమ గురించి ప్రేక్షకులు ఏదైనా అనుకుంటారేమోనన్న సందేహం వస్తోంది కాబోలు.. వారు చిన్న చిన్న విషయాలకే సిల్లీగా గొడవ పడుతున్నారు.
షణ్ముఖ్, సిరిలు.. గేమ్ బాగా ఆడుతున్నప్పటికీ చాలా చిన్న విషయాలకే గొడవపడినట్లు కెమెరా ముందు నటిస్తున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది. దీంతో ప్రేక్షకులు వీరి ప్రవర్తనకు విసుగెత్తిపోతున్నారు. కెమెరా ముందు యాక్ట్ చేయాల్సిన పనిలేదని గేమ్‌ను గేమ్‌లా ఆడాలని నెటిజన్లు చెబుతున్నారు.
ఇక షణ్ముఖ్‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కనుక ఇలాంటి సిల్లీ గొడవలు పడే బదులు గేమ్‌ను సరిగ్గా ఆడాలని.. అతనికి టైటిల్‌ను గెలుచుకునే సత్తా ఉందని.. ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి గేమ్, యాక్టింగ్, గొడవలను మానుకుంటారా.. లేదా.. చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…