Bigg Boss 5 : ష‌ణ్ముఖ్ టైటిల్ గెల‌వ‌గ‌ల‌డు.. డ్రామాలు అవ‌సరం లేదు..!

November 6, 2021 11:16 PM

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 సీజ‌న్ రాను రాను మరింత ఆస‌క్తిగా మారుతోంది. ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ వ‌చ్చే సరికి ప్రేక్ష‌కుల్లో తీవ్ర‌మైన ఉత్కంఠ నెల‌కొంటోంది. అయితే లీకు వీరుల కార‌ణంగా ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అవ‌బోయేది ఎవ‌రో తెలిసిపోతోంది. దీంతో ఒక రోజు ముందుగానే ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ ల‌భిస్తోంది.

Bigg Boss 5 shanmukh can win title stop dramas says fans

అయితే బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముఖ్‌, సిరిల గురించే సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. వారిద్దరూ ఆరంభం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. గేమ్‌లను క‌ల‌సి ఆడుతున్నారు. అలాగే సేమ్ కంటెస్టెంట్ల‌ను నామినేట్ చేస్తున్నారు. దీంతో త‌మ గురించి ప్రేక్ష‌కులు ఏదైనా అనుకుంటారేమోన‌న్న సందేహం వ‌స్తోంది కాబోలు.. వారు చిన్న చిన్న విష‌యాల‌కే సిల్లీగా గొడవ ప‌డుతున్నారు.

ష‌ణ్ముఖ్‌, సిరిలు.. గేమ్ బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ చాలా చిన్న విష‌యాల‌కే గొడ‌వ‌ప‌డిన‌ట్లు కెమెరా ముందు న‌టిస్తున్నార‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. దీంతో ప్రేక్ష‌కులు వీరి ప్ర‌వ‌ర్త‌న‌కు విసుగెత్తిపోతున్నారు. కెమెరా ముందు యాక్ట్ చేయాల్సిన ప‌నిలేద‌ని గేమ్‌ను గేమ్‌లా ఆడాల‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.

ఇక ష‌ణ్ముఖ్‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క‌నుక ఇలాంటి సిల్లీ గొడ‌వ‌లు ప‌డే బ‌దులు గేమ్‌ను స‌రిగ్గా ఆడాల‌ని.. అత‌నికి టైటిల్‌ను గెలుచుకునే స‌త్తా ఉంద‌ని.. ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి వీరి గేమ్‌, యాక్టింగ్‌, గొడ‌వ‌ల‌ను మానుకుంటారా.. లేదా.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment