Mani Sharma :మునుపటిలా ఆకట్టుకోలేకపోతున్న మణిశర్మ..? మెగా ఫ్యాన్స్‌లో అసంతృప్తి..?

November 6, 2021 11:34 PM

Mani Sharma :మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఒక‌ప్పుడు అద్భుత‌మైన సంగీతంతో శ్రోత‌ల‌ని ఉర్రూత‌లూగించేవాడు. ఎక్కువగా సినిమా ఆల్భ‌మ్స్‌లో మ‌ణిశ‌ర్మ పేరే ఉండేది. రాను రానూ ఆయ‌నకు క్రేజ్ త‌గ్గింది. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత మ‌ణిశ‌ర్మ మ‌ళ్లీ ముంజుపుకున్నాడు. వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Mani Sharma is not attracting with his music like old days

ఆచార్య చిత్రం నుండి విడుద‌లైన లాహే లాహే అనే పాట‌కి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఈ సాంగ్ మిలియ‌న్ వ్యూస్ కూడా రాబ‌ట్టింది. అయితే ‘ఆచార్య’ మూవీ టీమ్ సెకండ్‌ సింగిల్‌ ‘నీలాంబరి’ పాటను రీసెంట్‌గా విడుదల చేసింది. ‘నీలాంబ‌రి’ అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. అయితే ఈ పాట అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతుంద‌నే టాక్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేష‌న్‌గా మారిన థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్ అద్భుతమైన కంపోజిషన్‌లతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. మ‌ణిశ‌ర్మ పాత స్టైల్‌లోనే కంపోజ్ చేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న గ‌తంలో అద్భుత‌మైన మ్యూజిక్ అందించిన‌ప్ప‌టికీ ఇప్పుడు అంత‌గా ఇవ్వ‌లేక‌పోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథనే ఆచార్య మూవీ. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now