గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Manchu Manoj : మళ్లీ పెళ్లికి రెడీ అయిన హీరో మంచు మనోజ్.. రెండో భార్యగా రాబోతుంది ఎవరో తెలుసా..?

Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్‌కు…

Manchu Manoj : మళ్లీ పెళ్లికి రెడీ అయిన హీరో మంచు మనోజ్.. రెండో భార్యగా రాబోతుంది ఎవరో తెలుసా..?

Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్‌కు ఇదివరకే హైదరాబాద్‌కు చెందిన ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. 2015లో వీరి వివాహం కాగా.. ఈ జంట 2019లో విడిపోయారు. అప్పటి నుంచి మనోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అహం బ్రహ్మస్మి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. వారిద్దరు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు పెళ్ళి చేసుకుబోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. దీంతో ఇప్పుడు ఇటు చిత్రపరిశ్రమలోనూ, అటు రాజకీయరంగంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇక భూమా నాగిరెడ్డి దంపతుల మరణానంతరం అక్క అఖిలకు చేదోడు వాదోడుగా మారింది భూమా మౌనికా రెడ్డి.

Manchu Manoj getting ready for second marriage
Manchu Manoj

ఇటు మంచు మనోజ్‌కీ, అటు భూమా మౌనికా రెడ్డికీ గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణానంతరం వీరి బంధం మరింత బలపడింది. తరచూ మంచు మనోజ్‌ భూమా కుటుంబంలోని కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవాడు. ఆపదలో ఉన్న ప్రతిసారీ మంచు ప్రసెన్స్‌ భూమా ఇంట ఉండేది. అదే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించడానికి కారణమై ఉంచొచ్చు. ఇప్పుడు లేటెస్ట్‌ దృశ్యాలు మంచు మనోజ్‌, భూమా మౌనికారెడ్డిల వివాహాన్ని ఖరారు చేశాయి. సందర్భమొచ్చినప్పుడు తామే చెపుతామని మంచు మనోజ్‌ మీడియాకు చెప్పారు. ఇక మంచువారి ఇంట పెళ్ళి సందడి ఎప్పుడు మొదలవుతుందో ఎదురు చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి