Manchu Lakshmi : మలయాళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు తెలుగులో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మోహన్ లాల్ నటించే సినిమాలు కూడా తెలుగులోనూ మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఇక తాజాగా మోహన్ లాల్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ‘మాన్‌స్టర్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్ లాల్ లక్కీ సింగ్‌గా సర్దార్జీ పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోహన్ లాల్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ రెండు కుటుంబాలు పరస్పరం స్నేహ బంధంతో మెలుగుతుంటాయి. ఈ క్రమంలోనే మోహన్ లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని మంచు లక్ష్మికి కల్పించారు.
ఈ సినిమాలో మంచు లక్ష్మి ఒక ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను 40 రోజులలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఎలా ఉంటుంది ? ఏమిటి.. అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…